Type Here to Get Search Results !

సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవికుమార్

NAMASTHE NEWS 0

సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవికుమార్



నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:

పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వరంలాంటిదని మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవికుమార్ అన్నారు.గుండెపుడి గ్రామానికి చెందిన చిన్నబోయిన వీరబాబు బైక్ ప్రమాదానికి గురై వైద్య చికిత్స పొందారు.చికిత్సకు అయిన ఖర్చుల కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా రూ.1,18,400 మంజూరయ్యాయి.ఈ మేరకు గురువారం మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గుండెపుడి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం దామోదర్ రెడ్డితో కలిసి గుగులోత్ రవికుమార్ బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.పేదల వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకట్ రెడ్డి,సురబోయిన ఉప్పలయ్య,రేఖ శ్రీనివాస్,పెద్దపులి శ్రీను,రేఖ నరేష్ గౌడ్,ఏకస్వామి,బోడపట్ల నరేష్, రేఖ ఉప్పలయ్యతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System