ఏ ఎస్ ఐ మాద వెంకటేశ్వర్లకు సేవా పథకం అందజేసిన ఎస్పీ
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ |సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని పుట్టకోట బజారుకు చెందిన మాదా వెంకటేశ్వర్లు పోలీసుశాఖలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా సేవా పతకం అందుకున్నారు. ప్రస్తుతం ఇల్లందు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మాదా వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో నీతి, నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు సేవలందించడంలో ఈ సేవ పథకాన్ని అందించారు చిన్ననాటి నుంచి సేవా, సామాజిక దృక్పథంతో కొనసాగుతున్న మాదా వెంకటేశ్వర్లును పోలీసుశాఖ ఉన్నతాధికారులు అభినందించడంతో గార్ల మండలానికి చెందిన పలువురు ప్రముఖులు, అభినందనలు తెలిపారు.

