- డెంగ్యూతో వివాహిత మృతి
- హైమావతి పార్వతి దేహానికి నివాళులర్పించిన పలువురు నేతలు
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం అక్టోబర్ 7 (నమస్తే న్యూస్ )
డెంగ్యూ జ్వరంతో వివాహిత మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని పిండిప్రోలు గ్రామపంచాయతీ శివారు పాపాయిగూడెం గ్రామానికి చెందిన ఏలూరి సిద్ధారావు సతీమణి ఏలూరి హైమావతి 40 సంవత్సరాలు గత కొంతకాలం నుండి ఖమ్మంలో నివాసం ఉంటున్నారు ఇటీవల జ్వరం రావడంతో హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చేర్పించగా డెంగ్యూ జ్వరం నిర్ధారణ కావడంతో వైద్య సికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు మృతురాలకు ఇద్దరు కుమార్తెలు జనని, శరణ్య భర్త సిద్ధారావు కలరు మృతి వార్త తెలుసుకున్న పిండిప్రోలు మాజీ సర్పంచ్ నామ ప్రసాద్ గ్రామ ఉప సర్పంచ్ చామకూరి రాజ్ కుమార్ టి యు డబ్ల్యూ జే ఐ జే యు జిల్లా నాయకులు పప్పుల శ్రీనివాసరావు మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏలూరు ఆనందరావు మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గాదరి బాబు చామకూరి రమేష్ తాత రవీందర్ జాల ఉమేష్ జాల కిరణ్ తదితరులు హైమావతి పార్వతి దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు

