Type Here to Get Search Results !

పండుగ కోసం యువత శ్రమ.ఊరి కోసం ఐక్యత.

NAMASTHE NEWS 0

  •  పండుగ కోసం యువత శ్రమ.ఊరి కోసం ఐక్యత.
  • ఎండను,అలసటను లెక్కచేయకుండా ఏర్పాట్లలో నిమగ్నమైన 12వ వార్డు యువత.
  • గౌతమ్ రెడ్డి,మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బతుకమ్మ,నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు.


మరిపెడ,అక్టోబర్ 08(నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో తెలంగాణ బతుకమ్మ పండుగ,దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భతకమ్మ సంబరాలు,అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలకు వేదికల పరిసరాలను పరిశుభ్రం చేపిస్తున్న నాయకులు గౌతమ్ రెడ్డి,మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు యువత,స్థానిక ప్రజలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు.పండుగ ఏర్పాట్లలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎండను,అలసటను లెక్కచేయకుండా యువత శ్రమిస్తున్నారు.పండుగ వేదిక,పరిసర ప్రాంతాల ఏర్పాట్లలో భాగంగా మట్టి పోయడం,ఇతర పనులను యువత ఉత్సాహంగా చేపడుతోంది.ప్రతి పనిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ గౌతమ్ రెడ్డి ముందుండి యువతను సమన్వయం చేస్తున్నారు.ఆయనకు తోడుగా వార్డు యువత,స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ పండుగ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.డబ్బుతో కొనలేనిది మనసని,మాటలతో చెప్పలేనిది ఐక్యతని చాటుతూ యువత చూపుతున్న సేవాభావం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.ఎంత అలసిపోయినా వెనక్కి తగ్గకుండా పండుగ కోసం పనిచేస్తున్న 12వ వార్డు యువత పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.మట్టి తట్టలు మోస్తూ,ఏర్పాట్లలో భాగస్వాములవుతూ యువత చూపుతున్న ప్రతి అడుగులోనూ తమ ఊరిపై ఉన్న ప్రేమ,పండుగపై ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపిస్తోంది.ఊరి పండుగను తమ పండుగగా భావించి ఒక్కటై పనిచేస్తున్న యువతను స్థానికులు అభినందిస్తున్నారు.మన యువతే మన బలం..మన ఐక్యతే మన గర్వం..మన ఊరి పండుగే మన పండుగ అంటూ పండుగ ఏర్పాట్లలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు..





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System