Type Here to Get Search Results !

బహుజన రాజ్యాధికార సమరభేరికి తరలిరండి

NAMASTHE NEWS 0

  • బహుజన రాజ్యాధికార సమరభేరికి తరలిరండి
  • అగ్రకుల ఆధిపత్య రాజకీయాల వల్లే దళితులు, బహుజనులపై దాడులు
  • ఓట్లు మనవే.. సీట్లు మనవే.. బహుజన రాజ్యాధికారమే లక్ష్యం
  • పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ 

రిపోర్టర్ దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 7 (నమస్తే న్యూస్) 

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ దళితులు, బహుజనులపై జరుగుతున్న దాడులు, భూకబ్జాలు, సామాజిక వివక్షకు అగ్రకుల ఆధిపత్య రాజకీయాలే కారణమని పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మాన్యవర్‌ కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మాన్యవర్‌ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా అక్టోబర్‌ 9న వరంగల్‌లోని ఊర్సుగుట్ట నాని గార్డెన్‌లో నిర్వహించనున్న “బహుజన రాజ్యాధికార సమరభేరి” కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గంలోని అంబేద్కర్‌ అభిమానులు, సానుభూతిపరులు, సామాజిక ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఇకపై “ఓట్లు మనవే.. సీట్లు మనవే.. బహుజన రాజ్యాధికారమే మన లక్ష్యం” అనే నినాదంతో బహుజనులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే, కార్యదర్శి పోలేపొంగు మల్సూర్, సుబ్లేడు  సెక్టార్ అధ్యక్షులు ఎల్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System