Type Here to Get Search Results !

బీరోలులో ఘనంగా ఆహార పోషక మహోత్సవాలు

NAMASTHE NEWS 0

 

  • పిల్లలకు స్వచ్ఛమైన, సమతుల్య పోషకాహారం అందించాలి
  • ఆరోగ్యవంతమైన బాల్యం.. బలమైన భవిష్యత్తుకు పునాది
  • పోషకాహారం భవిష్యత్ తరాల బలానికి పెట్టుబడి
  • సర్పంచ్ గుమ్మడి దేవా బిక్షం



రిపోర్టర్ దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 7 (నమస్తే న్యూస్):


తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామం లో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఆహార పోషక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవబిక్షం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అందించాల్సిన సమతుల్య ఆహారం, పోషక విలువలు, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందించడంతో పాటు, తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.

“పిల్లలకు ఇచ్చే పోషకాహారం వారి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల బలానికి పెట్టుబడి” అని సర్పంచ్ దేవబిక్షం పేర్కొన్నారు. “ఆరోగ్యవంతమైన బాల్యం.. బలమైన భవిష్యత్తుకు పునాది. ప్రతి చిన్నారికి స్వచ్ఛమైన, సమతుల్యమైన పోషకాహారం అందించడం మనందరి బాధ్యత” అని ఆమె అన్నారు.

గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా సాగిందని అంగన్వాడీ సిబ్బంది తెలిపారు. చిన్నారులు, తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ  పేరం లక్ష్మీకాంత, గుమ్మడి పద్మ కమటం పద్మ ఆయాలు గుమ్మడి నీలమ్మ చింతిరాల వెంకటమ్మ, గర్భిణీ స్త్రీలు ఆత్మకూరి ప్రీతి, గ్రామ పెద్దలు గుమ్మడి శ్యామ్ కామల్ల సంజీవరావు గోపోజ్ సురేష్, గోపోజ్ వినోద్ కమటం వెంకన్న గోపోజు ప్రమీల గోపోజు సమ్మక్క కొండ నరసమ్మ దామల్ల ఉప్పమ్మ యమ్ము సుష్మ  తల్లులు గుమ్మడి శరణ్య గుమ్మడి భార్గవి కమటం వేదిక ఎల్లావుల సంఘవి ఆరోగ్య సూపర్వైజర్ మాధవి ఏఎన్ఎం ఉప్పలమ్మ ఆశాలు లింగమల్ల లక్ష్మి ముక్కెర్ల సరిత బాడిషా ఊర్మిళ నవ తెలంగాణ రిపోర్టర్ రాకేష్ రమేష్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ నమస్తే న్యూస్ దామల్ల భాస్కర్ గ్రామపంచాయతీ కార్యదర్శి బి మౌనిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System