Type Here to Get Search Results !

బతుకమ్మ వేడుకలకు నర్సింహులపేటలో ముందస్తు ఏర్పాట్లు

NAMASTHE NEWS 0

  • బతుకమ్మ వేడుకలకు నర్సింహులపేటలో ముందస్తు ఏర్పాట్లు
  • ఆడపడుచుల ఆత్మీయ కలయికకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు
  • రోడ్డుకు ఇరువైపులా ముండ్ల పొదల తొలగింపు



నర్సింహులపేట, అక్టోబర్ 8 (నమస్తే న్యూస్):

పల్లెలను పూల పరిమళాలతో మురిపించే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నర్సింహులపేట మండల కేంద్రంలో బంధం చెరువు వద్ద  ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా పెరిగిన ముండ్ల పొదలను జేసీబీ యంత్రం సహాయంతో తొలగించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో రహదారులు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ పెద్దమాముల యాకయ్య పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System