- కొక్కిరేణి లో శ్రీమంతాలు.. అన్నప్రసన వేడుకలు
- పోషణే ఆరోగ్యానికి పునాది
- గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి :
- కొక్కిరేణి గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం అక్టోబర్ 8 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోక్కిరేణి రామకృష్ణాపురం గ్రామం లో అంగన్వాడి ఆధ్వర్యంలో గురువారం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ పద్ధతిలో శ్రీమంతాలు నిర్వహించగా, చిన్నారులకు అన్నప్రసన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొక్కిరేణి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు సీమంతాలు పోషణ మహోత్సవ కార్యక్రమం లో చిన్నారులకు అన్నప్రసన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ గర్భిణీ స్త్రీలకు పూలు పండ్లు సారే వడి నింపి దంపతులను ఆశీర్వదించారు తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లోకొక్కిరేణి రామకృష్ణాపురం అంగన్వాడి కేంద్రం గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ కొక్కిరేణి ఎంపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ గుంతేటి వెంకటేశ్వర్లు ఏఎన్ఎం విజయలక్ష్మి అంగన్వాడి టీచర్ సిహెచ్ జయమ్మ ఆశ వర్కర్ విజయరాణి వార్డు సభ్యులు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి పిల్లలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

