- పత్రికా కథనాలకు స్పందించిన అధికార యంత్రాంగం స్పందన
- అజ్మీరా తండాలో మళ్లీ బడి బెల్!
- విలేకరుల వార్తలకు అధికార యంత్రాంగం స్పందన..
- విద్యార్థుల్లో ఆనందం
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,అక్టోబర్ 8 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని అజ్మీరా తండాలో ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాఠశాల సమస్యపై మనం పత్రికలో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం స్పందించి చర్యలు చేపట్టడంతో బడి పిల్లల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. గత రెండు సంవత్సరాలుగా మూతపడి అజ్మీర తండ నుండి జల్లే పెళ్లికి అవస్థలు పడుతూ బడికి వెళుతున్న పిల్లలు, వారు పడుతున్న అవస్థలను చూసి మనం పత్రిక వార్త కథనాలతో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన అధికారులు పాఠశాలకు అనుమతులు మంజూరు చేసి ప్రారంభించినారు.అజ్మీర తండా పాఠశాల ప్రారంభంతో తండా విద్యార్థులకు ఇక నుంచి స్థానికంగానే విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం లభించింది. దీంతో తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పున ప్రారంభానికి విశేష కృషి చేసిన గ్రామ సర్పంచ్ అజ్మీర నీలిమ బాలాజీ దంపతులు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలో చేర్పించాలని విశేషంగా కృషి చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల సమస్యను పరిష్కరించిన అధికార యంత్రాంగానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్రకు ఇదొక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.

