అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో అధిక దిగుబడులు
రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం అక్టోబర్ 8 (నమస్తే న్యూస్ )
రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించేందుకు దోహదపడుతుందని తిరుమలాపాలెం మండల వ్యవసాయాధికారి సీతారాం రెడ్డి సూచించారు.
గురువారం తిమ్మక్కపేట గ్రామంలో రాశి సీడ్స్ వారి ఆధ్వర్యంలో తిరుమలాపాలెం మండల పరిసర గ్రామాల రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నాగేశ్వరరావు పొలంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన రాశి సీడ్స్ పత్తి పంటను రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూపించారు.
ఈ సందర్భంగా నా రెడ్డి సీతారాం రెడ్డి మాట్లాడుతూ, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులు పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన యాజమాన్య చర్యలను సరైన సమయంలో చేపట్టాలని సూచించారు. పత్తి పంటకు అవసరమైన ఎరువులను పంట దశకు అనుగుణంగా సమతుల్యంగా వినియోగించాలని, నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అదేవిధంగా పంటలో కలుపు మొక్కలు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని, పురుగుల ఉనికిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న రైతులు మొక్కల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధిని నిశితంగా గమనిస్తూ తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాశి సీడ్స్ కంపెనీ సిబ్బంది, టెరిటరీ మేనేజర్ పవన్ కుమార్, రమేష్, రాంబాబు, పత్తి నాగేశ్వరరావు గారు, ప్రసాద్ , రైతులతో పాటు కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు వెంకటరమణ, సత్యనారాయణ గారు, సూర్యా సీడ్స్ పునుకొల్లు పృథ్వీ పాల్గొన్నారు.

