Type Here to Get Search Results !

అనారోగ్య బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.

NAMASTHE NEWS 0

అనారోగ్య బాధితులను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.


నమస్తే న్యూస్/అక్టోబర్ 07,డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని బంచరాయితండాకు చెందిన పత్రికా విలేకరి దేవన్న తండ్రి బానోత్ సక్రం ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.అదే గ్రామానికి చెందిన నునావత్ శ్రీను ఇటీవల ప్రమాదానికి గురై,వైద్యుల సూచన మేరకు కాలు తొలగించాల్సి వచ్చింది.ప్రస్తుతం చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనును మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నునావత్ వీరన్న,మాజీ ఎంపీటీసీ వీరు నాయక్,తేజ నాయక్,సేత్య,శరత్,ఐలి నరహరి గౌడ్,బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు..






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System