గుర్రప్ప తండాలో పోషణ మాసం వేడుకలు.
పోషకాహారం,ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన.
మరిపెడ,అక్టోబర్ 07(నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి సెక్టార్ పరిధిలోని గుర్రప్ప తండాలో బుధవారం పోషణ మాసం వేడుకలను ఘనంగా నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోషకాహారం,ఆరోగ్యం,పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ చిన్నారులు,గర్భిణులు,బాలింతలు పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.పోషణ మాసం లక్ష్యాలను ప్రజలకు వివరించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.కార్యక్రమంలో గుర్రప్ప తండా సర్పంచ్ బానోత్ శరత్,ఉల్లేపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు,లబ్ధిదారులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు..

