మైనార్టీ కాలనీలో డ్రైనేజీ,రోడ్డు పనుల పరిశీలన.
మరిపెడ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సునిత రవిందర్ రెడ్డి.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు మైనార్టీ కాలనీలో చేపట్టనున్న డ్రైనేజీ,రోడ్డు పనులను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి కాలం సునీత రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు,రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా అధికారులు,సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు.డ్రైనేజీ పనుల అనంతరం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే విధానం,నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా కాలువల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.పనులు ప్రారంభించే ముందు స్థానిక ప్రజల సమస్యలు,అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులు నాణ్యతగా,వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ పరిశీలనలో మున్సిపల్ ఏఈ శ్రీమతి అనిత,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకట రామన్న,స్థానిక వార్డు అధ్యక్షులు బోడ రమేష్,మాజీ సర్పంచ్ బానోత్ రామ్ లాల్,బాలమబోడ మోతిలాల్,కాంట్రాక్టర్ ఎస్ కె ఆఫ్జల్ భాయి,మున్సిపల్ సిబ్బంది వెంకట్ లాల్,వర్క్ ఇన్‌స్పెక్టర్ మన కృష్ణ,టెక్నికల్ అసిస్టెంట్‌తో పాటు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు..

