గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు.
అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన.
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్.
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదనపు గద్దుల నిర్మాణానికి షాంకుస్థాపన.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పాల్గొన్నారు.గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు.మంగళవారం మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఉన్న గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ..విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యనందించాలనే లక్ష్యంతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని,పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,పెండ్లి రఘువీరా రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్,టౌన్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్,వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,కౌన్సిలర్లు జాటోత్ సురేష్,జియో రమేష్,రాములు,రాము,కో-ఆప్షన్ సభ్యులు తిరుపతి,డీసీసీ సభ్యుడు కుడితి నరసింహ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



