Type Here to Get Search Results !

కురవి మండలం నారాయణపురంలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

NAMASTHE NEWS 0

కురవి మండలం నారాయణపురంలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు



కురవి, అక్టోబర్ 07 (నమస్తే న్యూస్)

కురవి మండలం నారాయణపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గ్రామ ఉప సర్పంచ్ భూక్య చందు, పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సమక్షంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System