Type Here to Get Search Results !

ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి!.. ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు చేయాలి.

NAMASTHE NEWS 0

ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి!
అర్హతే ప్రామాణికంగా ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు చేయాలి
కాంగ్రెస్ అనుకూలులకే ఇళ్లు కట్టబెడుతున్నారనే ఆరోపణలు
గ్రామసభలో పారదర్శక ఎంపిక.. 
అధిక దరఖాస్తులు ఉంటే లాటరీ పద్ధతి పాటించాలి



రిపోర్టర్ దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 5 (నమస్తే న్యూస్)


ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీఆర్‌ఎస్ మండల ఎస్టీ యువజన నాయకుడు భూక్యా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సుబ్లేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఇళ్లను కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని నాగేశ్వరరావు అన్నారు. అసలైన పేదలకు ఇళ్లు అందకుండా రాజకీయ ప్రాధాన్యతకు పెద్దపీట వేయడం సరికాదని పేర్కొన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామసభ నిర్వహించి ప్రజల సమక్షంలో అర్హులను గుర్తించి, మంజూరైన ఇళ్ల సంఖ్య కంటే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేవారని ఆయన తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత జాబితా వచ్చిన వెంటనే సుబ్లేడు గ్రామంలో గ్రామసభ నిర్వహించి, ప్రజల సమక్షంలో అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల సంఖ్య కంటే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎలాంటి రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.

అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇల్లు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ కమిటీల పేరుతో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని భూక్యా నాగేశ్వరరావు కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System