Type Here to Get Search Results !

ఘనంగా శాఖాహార మహా ర్యాలీ... పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం

NAMASTHE NEWS 0

తొర్రూరులో ఘనంగా శాఖాహార మహా ర్యాలీ


పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం




తొర్రూరు,ఆగస్టు 4,(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా శాఖాహార మహా ర్యాలీ నిర్వహించారు.తొర్రూరు పాటి మీది శివాలయంలో గత 50 రోజులుగా నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం, శాఖాహారం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని ప్రజల్లో అవగాహన కల్పించారు. "దేహమే దేవాలయం – శాఖాహారమే అమృతాహారం" అనే సందేశంతో పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ర్యాలీ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రారంభమై బస్టాండ్, ఎల్‌వైఆర్ గార్డెన్ మీదుగా తొర్రూరు పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని శాఖాహారం, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, విమల,కిషన్ రెడ్డి, దయాసాగర్,నాగమణి, సీతయ్య,రమేష్, రాజేందర్,రవీందర్,నవీన్ రెడ్డి,పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు, తొర్రూరు ధ్యాన కేంద్ర నిర్వాహకులు శోభన్ బాబు, శేఖర్, రామ్మూర్తి, సూర్యనారాయణ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System