Type Here to Get Search Results !

ప్రకృతిని పెంచుదాం... పల్లెకు అందాన్ని పంచుదాం: సర్పంచ్ పెదమాముల యాకయ్య

NAMASTHE NEWS 0

 

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం.



నర్సింహులపేట, ఆగస్టు 4 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య చేతుల మీదుగా గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ, "మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. ప్రకృతిని పెంచుదాం... పల్లెకు అందాన్ని పంచుదాం" అని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా యాకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System