Type Here to Get Search Results !

బోగారం గ్రామ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

NAMASTHE NEWS 0

బోగారం గ్రామ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా పంపిణీ



రామన్నపేట, ఆగస్టు 4 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన జెల్లా ధనుష్ తండ్రి జెల్లా రఘురాములకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కును నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.చెక్కు అందుకున్న ధనుష్ కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బోగారం మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెపూరి ఐలయ్య యాదవ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిరబోయిన నవీన్ యాదవ్, జెల్లా రఘురాములు, బొడ్డుపల్లి లింగయ్య, అంతటి శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System