Type Here to Get Search Results !

బోగారం అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

NAMASTHE NEWS 0

 

బోగారం అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

  • తొలి ఆరు నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారం: సర్పంచ్ సాయికుమార్ గౌడ్



రామన్నపేట, ఆగస్టు 4 (నమస్తే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని సూచించారు. గుడ్లు, పాలు వంటి పోషకాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయడంతో పాటు గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ, పుట్టిన శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమమైన, సంపూర్ణమైన ఆహారమని తెలిపారు. ప్రతి తల్లి ఈ విషయంలో అవగాహనతో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సుధా, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, విద్యా కమిటీ చైర్‌పర్సన్ పబ్బు జ్యోతి, అంగన్వాడి ప్రాజెక్టు సూపర్వైజర్ సుజాత, అంగన్వాడి టీచర్ బత్తుల వసంత, బుక్‌కీపర్ భోగ సంధ్య, అంగన్వాడి సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System