Type Here to Get Search Results !

టైల్స్ షాప్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్ డా. జాటోత్ రాంచందర్ నాయక్

NAMASTHE NEWS 0

 

శ్రీ భవాని టైల్స్ షాప్‌ను సందర్శించిన డిప్యూటీ స్పీకర్ డా. జాటోత్ రాంచందర్ నాయక్

  • స్థానిక వ్యాపారులు అభివృద్ధి చెందాలి.. నాణ్యత, నమ్మకమే విజయానికి మూలం.
  • రాష్ట్ర ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ రామచంద్రనాయక్



తొర్రూరు, ఆగస్టు 4 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పాల కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ భవాని టైల్స్ షాప్‌ను డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ డా. జాటోత్ రాంచందర్ నాయక్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు జాటోత్ స్వామిని కలిసి వ్యాపార నిర్వహణ, అభివృద్ధిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, వ్యాపార రంగంలో పట్టుదల, కృషి, నిజాయితీతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించవచ్చని అన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యమైన సేవలు అందించడమే వ్యాపార విజయానికి ప్రధాన ఆధారమని పేర్కొన్నారు.స్థానిక వ్యాపారులు అభివృద్ధి చెందడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని డిప్యూటీ స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు డా. జాటోత్ రాంచందర్ నాయక్‌కు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన సామాజికవేత్త జాటోత్ సాయికృష్ణ, డా. శంకర్, డా. వెంకన్న, స్వామి నాయక్, దంతాలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్, శ్రీనివాస్ గార్డెన్ చైర్మన్ గోపారాపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System