Type Here to Get Search Results !

వరుణ దేవుడు కరుణించాలని గ్రామదేవతలకు పూజలు.

NAMASTHE NEWS 0

వరుణ దేవుడు కరుణించాలని గ్రామదేవతలకు పూజలు.
ఇంటికో బింద చొప్పున మహిళలు నాభి శిల బొడ్రాయికి జలాభిషేకం
బతుకమ్మ పాటలతో వరుణ దేవుని వేడుకున్నా గ్రామస్తులు
పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ పాలక మండలి




యాదాద్రి/రామన్నపేట, జూలై 29(నమస్తే న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలో వరుణ దేవుడు కరుణించాలని వర్షాలు కురవాలని పాడిపంటలు చల్లగా ఉండాలని, గ్రామ దేవతలకు గ్రామ సర్పంచ్  కునూరు సాయికుమార్ గౌడ్ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమ సందర్భంగా ప్రతి ఇంటి నుండి ఇంటికి ఒక బింద చొప్పున మహిళలు భక్తిశ్రద్ధలతో గ్రామంలోని నాభి శిల బొడ్రాయికి జలాభిషేకం చేయడం జరిగింది ,ఆవుపాలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి పంచామృతాభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు,అనంతరం నైవేద్యాలు సమర్పించి గ్రామ శ్రేయస్సు, రైతుల సంక్షేమం, సకాలంలో వర్షాలు కురవాలని వరుణ దేవుడా కరుణించవా అంటూ వేడుకున్నారు, అనంతరం మహిళలు బతుకమ్మ ఆటపాటలతో వానమ్మ వానమ్మ ఉయ్యాలో ఒక్కసారి అన్న రావమ్మ ఉయ్యాలో.... అంటూ పాటలతో తమ గోడు వెళ్ళగొచ్చుకున్నారు, అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, గురు పౌర్ణమి సందర్భంగా గ్రామ ప్రజలు తీర్థ ప్రసాదములు స్వీకరించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు, గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, నేరటి మానస సురేష్, కడారి పావని పాపయ్య,, వనం ఆండాలు యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, ఆలయ పూజారి జెల్లా నిరంజన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సుధా, మహిళా సంఘం అధ్యక్షురాలు విద్యా కమిటీ చైర్మన్, పబ్బు జ్యోతి, వి బి కే, భోగ సంధ్య, అంగన్వాడీ టీచర్ బత్తుల వసంత, ఆశా వర్కర్స్ జెల్లా పారిజాత,జెల్లా సంధ్య, మాజీ ప్రజాప్రతినిధులు,యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు మధ్యపూరి ఐలయ్య, బద్దుల రమేష్ యాదవ్, నేరటి రమేష్ యాదవ్, గండూరి వెంకటేశం, వనం సిద్దేశ్వర్, చానకొండ గోపాల్ చారి, కూనూరు రాజు , కందగట్ల నరసింహ, కునూరు గోపాల్ ,గోవర్ధన్ రెడ్డి, కునూరు మహేష్ గౌడ్, బడుగు శివకుమార్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దైవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System