వాతావరణానికి అనుగుణంగా పంటలు వేయాలి
నీటిని పొదుపుగా వాడాలి.
వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగి రెడ్డి మల్లారెడ్డి.
యాదాద్రి/రామన్నపేట, జూలై 29(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలో వరుణ దేవుడు కరుణించాలని వర్షాలు కురవాలని పాడిపంటలు చల్లగా ఉండాలని, గ్రామ దేవతలకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారురామన్నపేట, జూలై 29 (నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వ్యవసాయ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ కాలానుగుణంగా రైతులు పంటలు వేయాలని ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఏలినివో కారణంగా వర్షాల ప్రభావము లేకపోవడం సరైన సమయానికి పంటలు నీరు అందక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు పొదుపుగా వాడుకోవాలని, రైతు ఎప్పటి మాదిరిగా వరి పత్తి సాగు కాకుండా జొన్నలు పెసలు మినుములు కంది ఆముదం వంటి పంటలపై దృష్టి సారించాలని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభదాయకమైన పంటలు ఎంచుకోవాలని పలు సూచనలు ఈ సందర్భంగా రైతులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, వ్యవసాయ అధికారి ఖాన్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సత్తయ్య, నాగు అంజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

