Type Here to Get Search Results !

మరిపెడలో మండలంలో ఇందిరమ్మ ఇళ్లు,ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి.

NAMASTHE NEWS 0

మరిపెడలో మండలంలో ఇందిరమ్మ ఇళ్లు,ఉపాధి పనుల పరిశీలన.  


వర్షాకాల వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి.


మరిపెడ మండల అభివృద్ధి అధికారి వేణు గోపాల్ రెడ్డి.





కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జూలై 29(నమస్తే న్యూస్)

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గ్రామీణ ఉపాధి పథకంతో అనుసంధానించిన నేపథ్యంలో,మరిపెడ మండలం స్టేజి తండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.గ్రామీణ ఉపాధి పథకం కింద 90 పని దినాలను ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎడతెగని వర్షాల కారణంగా దోమల జ్వరం,టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని,ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System