Type Here to Get Search Results !

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు.

NAMASTHE NEWS 0

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు.



మరిపెడ, జూలై 22(నమస్తే న్యూస్). 

బాలికల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేసి,క్యాన్సర్ బారినుండి వారిని కాపాడాలని వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల కార్యక్రమం బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక టీకాల కార్యక్రమంలో భాగంగా మొత్తం 20 మంది బాలికలకు ఉచితంగా టీకా మోతాదులను అందించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ,బాలికల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.చిన్న వయసులోనే ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా బాలికలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ టీకా వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకురాలు లక్ష్మి కుమారి,సహాయ నర్సు ప్రసూతి కార్యకర్తలు నాగమణి,ఆశా కార్యకర్తలు శ్రీదేవి,సునీత,కవిత,వినోద మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొని టీకాల ప్రక్రియను పూర్తి చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System