Type Here to Get Search Results !

జల్లేపల్లి లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బి ఎల్ ఓ ల సమావేశం .

NAMASTHE NEWS 0

జల్లేపల్లి లో వివిధ రాజకీయ  పార్టీల నాయకులతో  బి.ఎల్.ఓ ల సమావేశం. 




తిరుమలాయపాలెం,జూలై 22( నమస్తే న్యూస్)

తిరుమలాయపాలెం మండల పరిధిలోని జల్లేపల్లి గ్రామంలో మండల ఎన్నికల అధికారి లూదర్ విల్సన్ (ఎం ర్ ఓ) ఆదేశానుసారం  పంచాయతీ కార్యదర్శి, అబ్దుల్ రహీం అధ్యక్షతన  రాష్ట్ర ఎన్నికల కమిషన్ జి ఓ అమలులో భాగంగా  బిల్ ఓ సూపర్ వైజర్ (ఆర్ ఐ) వహీదా సూచనలతో బుధవారం నాడు బి ఎల్ ఓల సమావేశం గాదరి మలుసూరమ్మ (పి ఎస్ 19) జల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో జరుగుతున్న ఓటర్ల వివరాలను పరిశీలించారు. ముఖ్యంగా మరణించిన(డెత్)వారి ఓట్లు, వలసవెళ్లిన వారి (షిఫటెడ్)మరియు డబుల్ ఓటు ఉన్నవారిని ,తొలగించే క్రమాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, తెలుగుదేశంపార్టీల తరఫున హాజరైన వివిధ పార్టీల నాయకులు తొలగించిన వారి ఓట్లపై సుదీర్ఘంగా చర్చించి  ఒక నిర్ణయానికి వచ్చారు అన్ని పార్టీల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసి తొలగించిన  ఓట్లను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ (గ్రామ ఉపసర్పంచ్)మహిళా నెంబర్ రేఖ భద్రకాళి, వార్డు మెంబర్ తేజావత్ ఉపేందర్, గ్రామ కాంగ్రెస్ యూత్ లీడర్ తురక వేణు, బి ఆర్ఎస్ మండల నాయకులు పోట్ల జగదీష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దివ్వెల శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ ,యూత్ నాయకులు భాషబోయిన తనయ్ ప్రకాష్, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు వల్లభనేని మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System