Type Here to Get Search Results !

బస్సుకు దారి పేరుతో చెట్లకు గొడ్డలి వేటు... రాజారం గ్రామంలో వృక్షాల నరికివేతపై విమర్శలు.

NAMASTHE NEWS 0

బస్సుకు దారి పేరుతో చెట్లకు గొడ్డలి వేటు... రాజారం గ్రామంలో వృక్షాల నరికివేతపై విమర్శలు.
బస్సుకు దారి కల్పించడానికి చెట్టును నరికితే... రేపటి తరానికి నీడను నరికినట్టే.
ఒక చెట్టును పెంచడానికి సంవత్సరాలు పడుతుంది...నరకడానికి మాత్రం కొన్ని నిమిషాలే చాలు.
చెట్లు అడ్డంకులు కావు... అవే మన ఊపిరికి ఆధారాలు.





రిపోర్టర్:దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం,జూలై 24 ( నమస్తే న్యూస్) 

తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు తండా–రాజారం గ్రామాల మధ్య రహదారి పక్కన గతంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి వన సంరక్షణలో భాగంగా నాటిన వృక్షాలను ఇష్టానుసారంగా నరికివేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుకు అడ్డుగా తగులుతున్నాయని గ్రామపంచాయతీ సర్పంచ్ ఇష్టానుసారంగా గతంలో కూడా ఒక సైడు ఇలాగే నరికించాడు మరలా ఇప్పుడు అదే బస్సులకు అడ్డంగా వస్తున్నాయనే కారణంతో ఈ చెట్లను తొలగించారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసి, చెట్లను నరకవద్దని హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. 

ఈ వ్యవహారంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, "నాకు తెలియదు" గ్రామపంచాయతీ సర్పంచి ఇష్టానుసారంగా చెట్లను నరికించినాడని ఆ చెట్లను నేను నరకవద్దని గతంలోని చెప్పినానని అయినా నా మాటలు పట్టించుకోకుండా జెసిపి సహాయంతో చెట్లను ఇష్టం వచ్చిన రీతిలో తొలగించాలని సమాధానం చెప్పడం జరిగింది. వృక్షో రక్షతి రక్షా అని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని గ్రామాల వారీగా నర్సరీలలో మొక్కలు పెంచి చేపడుతుంటే ఆ మొక్కలు పెంచి పోషించవలసిన సర్పంచ్ పెరిగి పెద్దయిన ఈ చెట్లను కుక్కిటివేలతో సహా తీపించి రోడ్డు ప్రక్కన పడేయడం ఏంటా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకువచ్చి, చెట్ల తొలగింపుకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? సంబంధిత నిబంధనలు పాటించారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టి, వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే తొలగించిన చెట్లకు బదులుగా తగిన సంఖ్యలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System