Type Here to Get Search Results !

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న మహిళలు... సిపిఎం ఇంటింటి సర్వే

NAMASTHE NEWS 0

  • ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న మహిళలు.
  • ఇంటింటి సర్వేలో బయటపడ్డ సంక్షేమ పథకాల అలసత్వం.



డోర్నకల్/మరిపెడ(జులై 24)నమస్తే న్యూస్.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తాళ్ల ఊకళ్ళు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న మరిపెడ మండలం తాళ్ల ఊకళ్ళు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో గ్రామ మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు.ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి పథకం పూర్తిగా మాయమైపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమలు కాని ప్రధాన హామీలు:

- *మహిళలకు నెలకు 2500:* ఇస్తామని చెప్పారు.ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఏ మహిళకు ఇవ్వలేదు.మహిళలు ఎంతో ఆశపడ్డారు.ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

- ఇందిరమ్మ ఇండ్లు: 

- రెండవ దఫా ఇస్తామన్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టారు.డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం పేదలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.పేదవారి కళ్లలో ఆనందం నింపేందుకు వెంటనే ఇండ్లు ఇవ్వాలని కోరారు.

- పింఛన్లు: 

- 2000 పింఛన్ తీసుకునే వారికి 4000 ఇస్తామన్నారు.వికలాంగుల,ఒంటరి మహిళల పింఛన్ పెంచుతామన్నారు.కొత్త పింఛన్లకు పేర్లు రాసి ఆన్‌లైన్ చేశారు.కానీ ఇంతవరకు వాటి ఊసే లేదు.పేదలు ఆశతో డబ్బులు ఖర్చు పెట్టి ఆన్‌లైన్ చేయించుకుని ఎదురు చూస్తున్నారు.

- రైతు కూలీలకు కూలి బంధు 12000:

- ఇచ్చే హామీని పూర్తిగా మరిచిపోయారు.నాయకుల మాటలు నీటి మూటలేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- నిరుద్యోగ భృతి: ఉద్యోగం రాని వారికి ఇస్తామన్న హామీ నెరవేరలేదు.

- శానిటేషన్,సైడ్ కాల్వలు:

- ఊర్లో ఎక్కడ చూసినా చెత్త అలాగే ఉంది.వర్షాకాలం కావడంతో దోమలు విజృంభిస్తున్నాయి.బ్లీచింగ్ పౌడర్ చల్లడం గానీ,దోమల మందు పిచికారీ గానీ లేదు.సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.అందుకే వెంటనే గ్రామంలో శానిటేషన్ చేపట్టాలని,సైడ్ కాల్వలు నిర్మించాలని బాణాలు రాజన్న డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్లూరి క్రాంతి,ఇరుగు బిక్షమయ్య,తప్పెట్ల వెంకటయ్య,ఇరుగు పార్ధు,తప్పెట్ల పద్మ,మట్టె వెంకటమ్మ,తప్పెట్ల లచ్చమ్మ,తప్పెట్ల ముత్తమ్మ,తప్పెట్ల ఉదయమ్మ తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System