సుబ్లేడులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
తిరుమలాయపాలెం,జూలై 24 (న్యూస్)
తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు కీసర సంకీర్త్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కీసర సంకీర్త్ రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గండమల్ల సూరయ్య, వశపొంగు వెంకన్న, నేతకాని సురేష్, పోలేపొంగు బాలరాజు, ఉప్పునూతల ఉపేందర్, శంకర్, మల్సూర్ స్టాలిన్, సైదులు, ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

