- మౌలిక సదుపాయాల లేమితో మరిపెడ పాఠశాల విద్యార్థుల యాతన.
- బురదలో నడుస్తూ,తుప్పల్లోకి వెళ్తున్న విద్యార్థులు.
- అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి.
మరిపెడ(జూలై 20)నమస్తే న్యూస్:
చిన్న చినుకు పడితే చాలు..మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాలు పూర్తిగా బురదమయంగా మారుతున్నాయి. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సోమవారం కురిసిన వర్షానికి పాఠశాల చుట్టుపక్కల వీధులు,ఆవరణ అంతా బురదతో నిండిపోయింది. దీంతో విద్యార్థులు నడవడానికి సైతం ఇబ్బంది పడ్డారు. పుస్తకాలు, యూనిఫాంలు బురదతో తడిసిపోయే పరిస్థితి నెలకొంది.ఇప్పటికే పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. వర్షం కారణంగా బయట దారులన్నీ బురదతో నిండిపోవడంతో పిల్లలు బురదలోనే నడుచుకుంటూ, తుప్పల్లోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్షాల కారణంగా పాములు, తేల్లు, విష పురుగుల వలన పిల్లలకు ప్రమాధాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా అలాగే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కలిపించాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల పరిసరాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ,సిమెంట్ రోడ్లు వేయాలని, మరుగుదొడ్లను వెంటనే శుభ్రపరచి వినియోగానికి అనువుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను అధికారులు గుర్తించి వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

