Type Here to Get Search Results !

వర్షాకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి.

NAMASTHE NEWS 0

  • వర్షాకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి సూచన.
  • మరిపెడలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.



మరిపెడ,జులై 21(నమస్తే న్యూస్).

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరిపెడ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి సూచించారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.మంగళవారం మరిపెడ గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరానికి ప్రభుత్వ డాక్టర్ గుగులోత్ రవి,డాక్టర్ కిరణ్ కుమార్ హాజరై సుమారు 150 మందికి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ,వర్షాకాలంలో వైరల్ జ్వరాలు,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.దోమల నివారణ చర్యలు చేపట్టాలి.మరిగించిన నీటిని చల్లార్చి గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి.పోషకాహారం-పండ్లు,పాలు జ్యుసులు తీసుకోవాలి.జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. శిబిరంలో రక్తపోటు,మధుమేహం తదితర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి,రోగులకు తగిన వైద్య సలహాలు కూడా అందించారు.ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కూడా కల్పించారు.కార్యక్రమంలో ఏఎన్ఎం నాగమణి,బాల వికాస సంస్థ సెంటర్ మేనేజర్ గంధసిరి ఉపేంద్ర,సహ కోఆర్డినేటర్లు జుజ్జూరి ఉపేంద్ర,గుగులోత్ కవిత,ఆశ కార్యకర్తలు శ్రీదేవి,అనసూర్య,వినోద్,గ్రూప్ సభ్యులు,మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System