Type Here to Get Search Results !

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏళ్ల తరబడి జాప్యం ఎందుకు?

NAMASTHE NEWS 0

  • మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏళ్ల తరబడి జాప్యం ఎందుకు?
  • తక్షణమే అమలు చేసి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం  పెంచాలి.
  • ప్రగతి శీల మహిళా సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి గోకినపల్లి సరోజిని.

తిరుమలాయపాలెం,జూలై 21 (నమస్తే న్యూస్)
మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటిస్తున్న పాలకులు.. ఏళ్లు గడుస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు అమలు చేయడం లేదని ప్రగతిశీల మహిళా సంఘం (P.O.W.) పాలేరు డివిజన్ కార్యదర్శి గోకినపల్లి సరోజిని ప్రశ్నించారు.

మహిళలు జనాభాలో సగభాగంగా ఉన్నప్పటికీ, రాజకీయ రంగంలో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత గురించి గొప్పగా మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం, మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, దాని అమలు విషయంలో స్పష్టత లేకపోవడం మహిళల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉందన్నారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితేనే చట్టసభల్లో వారి సమస్యలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని, రాబోయే ఎన్నికల్లో మహిళలకు చట్టసభల్లో అధిక సంఖ్యలో సీట్లు కేటాయించాలని గోకినపల్లి సరోజిని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System