తిరుమలాయపాలెం గర్జన పార్టీల సరిహద్దులు చెరిపేసిన ‘జేఏసీ’ చైతన్యం!
• గుండా కరుణాకర్ రెడ్డి సన్మాన సభలో సరికొత్త రాజకీయ సమీకరణాలు
•ఖమ్మం జిల్లా ‘జేఏసీ’ సారథిగా మందడి ఇజ్రాయిల్.. ఉద్యమ చైతన్యానికి నూతన ఊపిరి
తిరుమలాయపాలెం జూలై 25 (నమస్తే న్యూస్ )
రాజకీయ జెండాలు వేరైనా... సిద్ధాంతాలు వేరైనా... ప్రజా సమస్యల వేదికపై అందరూ ఒక్కటేనని తిరుమలాయపాలెం నిరూపించింది. దమ్మాయిగూడెంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్ శనివారం కేవలం ఒక సన్మాన సభకు మాత్రమే కాదు, ఒక సరికొత్త సామాజిక ఐక్యతకు వేదికైంది. తెలంగాణ జేఏసీ నూతన రాష్ట్ర చైర్మన్ గుండా కరుణాకర్ రెడ్డికి మండల ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం గొంతుకయ్యే నాయకత్వానికి దక్కిన అసలైన ప్రజా గౌరవమిది.
వ్యూహాత్మక ప్రకటన.. ఖమ్మం జిల్లాకు కొత్త దిక్సూచి
మందడి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో భావోద్వేగాల మధ్య సాగిన ఈ సభలో జేఏసీ చైర్మన్ గుండా కరుణాకర్ రెడ్డి చేసిన ఒకే ఒక్క ప్రకటన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. నాలుగు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలిచిన మందడి ఇజ్రాయిల్‌ను తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏ పదవులకూ లొంగని ఇజ్రాయిల్ సుదీర్ఘ పోరాట పటిమకు దక్కిన సముచిత గౌరవమిది.
ప్రజాక్షేత్రంలో జేఏసీ పునర్వైభవం ఖాయం
ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం ప్రజల ఆత్మీయత తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ, జేఏసీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు ఇజ్రాయిల్ సారథ్యంలో ఖమ్మం జిల్లాలో జేఏసీ ప్రజాపోరాటాలు మరింత ఉధృతం కానున్నాయని ఈ సభ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం రాజశేఖర్ వివో ఏ ల మండల అధ్యక్షురాలువేల్పుల సుశీల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొండ బాల కరుణాకర్
సిపిఎం మండల నాయకులు పురం మల్లయ్య
దమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ వీరదాస్ వినోద కాంగ్రెస్ మండల నాయకులు కట్కూరు శ్రీనివాస్ రెడ్డి కోట్ల కిరణ్ సిపిఎంఎల్ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బాజా సత్యం మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నాగేష్ గౌడు ,మాజీ ఎంపీటీసీ గుగులోత్ పాప నాయక్ మాజీ హైదర్ సాయిపేట సర్పంచ్ బానోత్ చిమ్లా నాయక్ ,మాజీ సర్పంచ్ బానోత్ అనిల్,మహబూబాద్ జేఏసీ అధ్యక్షులు వీరన్న మండల కాంగ్రెస్ నాయకులు పత్తి నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు షేక్ ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.




