కేంద్ర మంత్రి రాజీనామా సరిపోదు,సమగ్ర విచారణ జరిపివ్వాలి.
మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి.
అలాగే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
సిపిఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్ రషీద్ డిమాండ్.
డోర్నకల్/మరిపెడ(జులై 25)నమస్తే న్యూస్.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఒక్కటే పరిష్కారం కాదని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ అన్నారు.మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని రాజీవ్ సెంటర్‌లో ఆయన మాట్లాడారు.నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈ కుంభకోణంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పారదర్శకత,భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

