Type Here to Get Search Results !

మరిపెడ విద్యుత్ సబ్ స్టేషన్లో బుర్హన్‌పురం రైతుల ఆందోళన.

NAMASTHE NEWS 0

మరిపెడ విద్యుత్ సబ్ స్టేషన్లో బుర్హన్‌పురం రైతుల ఆందోళన.
ట్రాన్స్‌ఫార్మర్ కోసం డబ్బులుకట్టి 40 రోజులైనా పట్టించుకోని అధికారులు.
ఎండుతున్న వరినారులు,విద్యుత్‌తో రైతుల అవస్థలు.



డోర్నకల్/మరిపెడ(జులై 25)నమస్తే న్యూస్.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హన్‌పురం గ్రామంలో విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలోని మొదటి విద్యుత్ కేంద్రం పరిధిలో ఉన్న కనెక్షన్లకు గత రెండు సంవత్సరాలుగా తక్కువ వోల్టేజి,సరిగ్గా కరెంటు రాకపోవడంతో యాసంగి పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం ఎనిమిది మంది రైతులు డబ్బు చెల్లించి దాదాపు 40 రోజులు దాటినా ఇప్పటివరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.ఇప్పటికే నాటిన వరినారులకు నీళ్లు అందక ఎండిపోతున్నాయి.పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.అంతేకాకుండా,లైన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తరచూ విద్యుత్ తీగలు తెగిపోతున్నాయి.దీంతో రైతులే సొంతంగా మరమ్మతులు చేసుకోవాల్సి వస్తుంది.ప్రతిరోజు ఫిర్యాదు కోసం ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.గతంలో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కించే సమయంలో బాణోత్ రవి నాయక్ అనే రైతు చేతికి గాయమై 12 వేల రూపాయల వరకు ఖర్చు అయినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.వెంటనే స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి ఎండిపోతున్న వరినారులను,పంటలను కాపాడాలని బుర్హన్‌పురం గ్రామ రైతులు కోరుతున్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System