- మాకుల ఆలయం,పెద్ద చెరువు కాలువలో పారిశుధ్య పనులు.పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి.
- శానిటేషన్,విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం.
- మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ(జులై 24)నమస్తే న్యూస్:
మరిపెడ పట్టణంలోని 10వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి,పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముందుగా మాకుల ఆలయ ఆవరణలో జరుగుతున్న పారిశుధ్య పనులను,విద్యుత్ మరమ్మత్తు పనులను ఆమె పరిశీలించారు.ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని,భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.విద్యుత్ స్తంభాల వద్ద ఉన్న లోపాలను సరిచేయాలని,రాత్రి సమయంలో భక్తులకు,స్థానికులకు వెలుతురు సమస్య రాకుండా చూడాలని లైన్ మెన్‌లకు సూచించారు.అనంతరం పెద్దచెరువు కాలువ వద్దకు వెళ్లిన చైర్‌పర్సన్,కాలువలో అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు,చెత్తను తొలగిస్తున్న పనులను పరిశీలించారు.వర్షాకాలం నేపథ్యంలో నీరు సాఫీగా ప్రవహించేందుకు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని,అపరిశుభ్రతతో ప్రజలు అనారోగ్యం భారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని,ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ,ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ,మున్సిపల్ ప్రధాన లక్ష్యమని అన్నారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుధ్యం,వీధి దీపాలు,డ్రైనేజీ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు.ప్రజలెవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ పర్యటనలో వారి వెంట విద్యుత్ లైన్‌మెన్ మాలు,ఉపేందర్,బిక్షం మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

