- ప్రజల సహకారంతో వాల్య తండా గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.
- వాల్య తండ గ్రామ పంచాయితి సర్పంచ్ నాగ నాయక్.
డోర్నకల్/మరిపెడ(జులై 24)నమస్తే న్యూస్.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధ్యమవుతుందని వాల్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ నాగ నాయక్ అన్నారు.సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.శుక్రవారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగ నాయక్ మాట్లాడుతూ,గ్రామపంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ పాలకవర్గం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.ప్రజల సహాయ,సహకారాలతోనే గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా చేపట్టి ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టాకిర్య నాయక్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,మాజీ ప్రజా ప్రతినిధులు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

