Type Here to Get Search Results !

వాతావరణానికి అనుకూలమైన పంటలు వేసి "ఎల్ నినో " ప్రభావం నుండి సురక్షితంగా బయటపడదాం:ఏఈఓ హసీనా

NAMASTHE NEWS 0

వాతావరణానికి అనుకూలమైన పంటలు వేసి  "ఎల్ నినో "  ప్రభావం నుండి సురక్షితంగా బయటపడదాం:ఏఈఓ హసీనా




తిరుమలాయపాలెం,జులై 24 (నమస్తే న్యూస్)

తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో ఎల్ నినో ప్రభావం ప్రత్యామ్నాయ  పంటలు అనే అంశంపై గ్రామ సభ పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ రహీం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఏ ఇ ఓ మాట్లాడుతూ గ్రామంలోని రైతులందరూ ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా పడటం వల్ల రైతులు ప్రత్యమాయ పంటలు ఎంచుకోవాలని అన్నారు. కంది, పెసరు, మినుము, జొన్నలు, సజ్జలు, వంటి పంటలను వేయాలని సూచించారు. జలసిరిలో భాగంగా ఇంకుడు గుంటల్లోకి ఇంటిలో వాడుకున్న నీటిని, వర్షం నీటిని ప్రతి నీటి చుక్క కూడా ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పంట కుంటలు, నీటి కుంటలను తయారు చేసుకోవాలన్నారు. ఆ నీటిని నిల్వ చేసుకోవడం వల్ల బావులలో, బోర్లలో భూగర్భ జలాలు పెరిగి   పంటలకు నీటి కొరత లేకుండా ఉపయోగించుకోవచ్చు అన్నారు. వెటర్నరీ డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ  సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గొర్రెలకు, మేకలకు, తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. ప్రజలు, రైతులు వివిధ రకాల జబ్బులు ప్రబలకుండా  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామ రైతులు పోట్ల కిరణ్ మాట్లాడుతూ వర్షాలు లేకపోవడం వలన రైతులు పంట మార్పిడి ప్రత్యయం పంటలు కందులు, పెసర, జొన్న, సద్దలు, మినుములు వేసుకోవాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచి అనపర్తి రవి, ఉపసర్పంచి రేఖ భద్రకాళి, రైతులు పోట్ల వెంకయ్య, పోట్ల కిరణ్, నాగండ్ల ప్రసాద్, మట్ట హనుమంతరావు, మేకల యాలాద్రి, గాదరి వెంకన్న, మేకల రమేష్, బొడ్డు ఎంకన్న, లపంగి ఎంకయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, మలుసూరు, లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ, లస్కర్ ఎర్రి రామచంద్ర, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System