Type Here to Get Search Results !

రాబోయేది మన ప్రభుత్వమే.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి: బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న

NAMASTHE NEWS 0

  • తిరుమలాయపాలెంలో అంబరాన్నంటిన కేటీఆర్ జన్మదిన సంబరాలు!
  • రాబోయేది మన ప్రభుత్వమే.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి: బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన  వీరన్న
  • అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ అక్రమాలపై బీఆర్‌ఎస్ నిరసన.



తిరుమలాయపాలెం, జూలై 24 (నమస్తే  న్యూస్ )

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు  భాష బోయిన   వీరన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


కేసీఆర్ మార్క్ అభివృద్ధే మనకు శ్రీరామరక్ష:

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు  వీరన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రగతి శిల్పి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అపూర్వ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ ప్రపంచ పటంలో తెలంగాణ ముద్రను అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా, రాబోయేది ఖచ్చితంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశాన్ని కుదిపేస్తున్న ‘నీట్’ పరీక్ష అక్రమాలపై సమరభేరి:

జన్మదిన వేడుకల అనంతరం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీల వల్ల దేశంలో, రాష్ట్రంలో తలెత్తిన శాంతిభద్రతల సమస్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద  వీరన్న నాయకత్వంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న పాలకుల వైఖరిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోడా మంచా నాయక్, ధరావత్ శంకర్, చిర్రా కృష్ణయ్య, బాలాజీ నగర్ తండా సర్పంచ్  మాలోత్ బద్రు నాయక్, గంటా కృష్ణ గుగ్గిల అశోక్,గద్దల మన్మధరావు, కొప్పుల శ్రీనివాసరావు, బుల్లి కొండ రమేష్, బోడ రవి, వీరబోయిన శ్రీనివాస్,షేక్ చందు,తాత రవీందర్ తదితరులు పాల్గొన్నారుమండల స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System