Type Here to Get Search Results !

గురుపౌర్ణమి నాడు విషాదం... రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి.

NAMASTHE NEWS 0

రిటైర్డ్ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ కన్నుమూత.


వివిధ పార్టీలనాయకుల నివాళులు.





కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జూలై 29(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్ గత కొంత కాలంగా అనారోగ్యంతో భాధపడుతూ బుధవారం తెల్లవారుజామున అస్వస్థతతో మరణించారు.పలువురు నాయకులు పరామర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన 2006 లో అబ్బాయిపాలెం ప్రాథమిక పాఠశాల నుండి పదవీ విరమణ పొందారు.ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో శ్రద్ధతో పాఠశాలకు వెళ్లి అనేక మంది విద్యార్థులకు విద్యను బోధించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారని,ఆయన వద్ద విద్యను అభ్యసించిన వారు ఈరోజు ఉన్నతమైన పదవుల్లో,వ్యాపారాల్లో ప్రయోజకులుగా కొనసాగుతున్నారని కొనియాడారు.అబ్దుల్ ఖాధర్ కు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు అబ్దుల్ అజీజ్ డోర్నకల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారని,చిన్న కుమారుడు అబ్దుల్ రషీద్ భారత కమ్యూనిస్టు పార్టీలో జిల్లా స్థాయిలో చురుకుగా పని చేస్తున్నారు అని గుర్తు చేశారు.ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి కుమారులు అబ్దుల్ అజీజ్,అబ్దుల్ రషీద్ లను పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు,ఆత్మ కమిటి చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి,జిల్లా కమిటి సభ్యులు బుర్ర సమ్మయ్య,పోలేపక వెంకన్న,భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మండల కార్యదర్శి గుండ గాని మధుసూధన్,మార్క్సిస్టు మండల కమిటి సభ్యులు బాణాల రాజన్న,కందాల రమేష్,తాటికొండ అనంత చారి,దొంతు మమత,వార్తా విలేఖరి సత్తార్ భాష,వీరారం శాఖ బాధ్యులు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System