వివరాలు సమర్పించని ఓటర్లు తమ వివరాలను వెంటనే సంబంధిత అధికారుల దగ్గర లేదా ఆన్లైన్ విధానం ద్వారా సమర్పించాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
మహబూబాబాద్,జూలై22(నమస్తే న్యూస్)
SIR సవరణ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ, డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు ఇప్పటికే ఎనమ్రేషన్స్ ఫార్మ్స్ అందజేయడం జరిగిందని, తిరిగి బిఎల్వోలకు సమర్పించిన వివరాల ఆధారంగా ఓటరు జాబితా ప్రకారం మ్యాపింగ్ చేసి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని, ఇంకా తమ వివరాలు సమర్పించని ఓటర్లు తమ వివరాలను వెంటనే సంబంధిత అధికారుల దగ్గర లేదా ఆన్లైన్ విధానం ద్వారా కూడా సమర్పించాలని కలెక్టర్ సూచించారు.అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులు (బిఎల్ఏ) ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, క్షేత్రస్థాయిలో పాత ఓటరు జాబితా ప్రకారం స్థానిక ఓటర్ వివరాలను గుర్తించాలని, అందులో షిఫ్ట్ అయిన వారిని, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు ఓటు హక్కును మార్చుకున్న వారు , రెండు ఓట్లు కలిగిన వారి వివరాలను క్లియర్ గా నమోదు చేయాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, లేదా సంబంధిత బూతు లెవెల్ అధికారులకు, సమాచారం అందించాలని, ఫామ్స్ నింపడంలో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉంటే ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో సంప్రదించాలని, ఎస్ ఐ ఆర్ సవరణ డిజిటలైజేషన్ కార్యక్రమంలో ఎలాంటి తప్పుడు వదంతులను నమ్మవద్దని ఏదైనా పూర్తి సమాచారం కోసం దగ్గరలోని బిఎల్ఓ ను గానీ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఎలక్షన్ సెక్షన్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు సార్ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న సర్వే గురించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నితీష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మారినేని వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, సురేష్ నాయుడు, బిజెపి ప్రతినిధి శ్యాంసుందర్ శర్మ, టిడిపి బి. రామారావు, సిపిఐ పెరుగు కుమార్, నవీన్, సిపిఎం రాజమౌళి, ఎలక్షన్ సూపర్డెంట్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

