- బ్రెయిన్ స్ట్రోక్ తో బీఆర్ఎస్ నాయకుడు మృతి.
- నివాళులర్పించిన పలువురు నేతలు
తిరుమలాయపాలెం,జూలై 22 (నమస్తే న్యూస్ )
మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త చామకూరి సత్యం 50 సంవత్సరాలు మంగళవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్య చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు.మృతునికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు భార్య వార్డు మెంబర్ చామకూరి రేణుక కలరు మృతిని అంతక్రియలు గురువారం ఉదయం 11:30 గంటలకు అంతక్రియలు నిర్వహిస్తున్నట్లు మృతురాలి చిన్న కుమారుడు బి ఆర్ ఎస్ యూత్ నాయకులు చామకూరి శరత్ తెలిపారు.మరణ వార్త తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త ఉపసర్పంచ్ చామకూరి రాజ్ కుమార్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పరికిపల్లి చంద్రశేఖర్ చామకూరి వెంకన్న పసలాది ముత్తయ్య చామకూరి సురేందర్ సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి దొడ్డ లింగస్వామి వార్డు సభ్యులు పప్పుల ఉపేందర్ దొండేటి నిర్మల్ రావు కాంపాటి బాబురావు కాంగ్రెస్ నాయకులు చామకూరి శ్రీనివాస్ మేకల సత్యనారాయణ రావూరి యాకుబ్రావ్ షేక్ సలీం సత్యం పాఠ్యదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


