Type Here to Get Search Results !

ఢిల్లీ పార్లమెంటు సరిహద్దుల్లో నిరసన కారులపై లాటించార్జిని ఖండించండి: పి.వై.ఎల్

NAMASTHE NEWS 0

  • ఢిల్లీ పార్లమెంటు సరిహద్దుల్లో నిరసన కారులపై లాటించార్జిని ఖండించండి: పి.వై.ఎల్ 
  • కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
  • ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) ఖమ్మం జిల్లా కార్యదర్శి  గొర్రెపాటి రమేష్



తిరుమలాయపాలెం, జూలై 21 (నమస్తే న్యూస్ )

ఢిల్లీ పార్లమెంటు సరిహద్దుల్లో నిరసన కారులపై లాటించార్జిని ఖండించండి.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రశ్నించే గొంతులను అణిచివేసే కేంద్ర  ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిద్దామని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్)ఖమ్మం జిల్లా కార్యదర్శి గొర్రెపాటి రమేష్ అన్నారు.

 నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసనకారులపై పోలీసుల లాటి చార్జిని ఖండిస్తూ వారు  ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఢిల్లీ పార్లమెంట్ సరిహద్దుల్లో నిన్న నిరసన తెలుపుతున్న కాక్రోచ్ పార్టీ , ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బలప్రయోగానికి దిగడం తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఆ హక్కును అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిరసనకారులపై రక్తాలు కారే విధంగా లాఠీలతో దమనకాండను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమన్నారు.నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి  సోనం వాంగ్‌చుక్ అక్రమ అరెస్టు, ఢిల్లీలో విద్యార్థులు, యువత, ప్రజాసంఘాల నాయకులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ దేశ విద్యా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమయ్యే పరీక్షలో ఇలాంటి అవకతవకలు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System