Type Here to Get Search Results !

సిపిఐ దశబ్దకాల పోరాట ఫలితంగా హై లెవల్ బ్రిడ్జి మంజూరు-ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు.

NAMASTHE NEWS 0

రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు.
-సిపిఐ దశబ్దకాల పోరాట ఫలితంగా బ్రిడ్జి మంజూరు.



రిపోర్టర్:పిల్లల నరసింహారావు 

సెంటర్: గార్ల.

మహబూబాబాద్,జూలై 25(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా గార్ల రాంపురం హై లేవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను కొత్తగూడెం శాసనసభ్యులు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు శనివారం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. రాంపురం చెక్ డ్యాo తక్కువ ఎత్తులో ఉండడం వలన వరద నీటి ఉధృతికి రాంపురం,మద్దివంచ గ్రామ పంచాయతీలతోపాటు ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు రాకపోకలకు నెలలు తరబడి అంతరాయం కలుగుతుండగా దశాబ్దాల కాలంగా సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. ఎన్నోసార్లు మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి అధికార పార్టీలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు వింత పత్రాలు అందించడం జరిగిందని ఈ పోరాట ఫలితంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషి తో నేటి ప్రజాపాలన ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమైందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టి త్వరతగతిన  వినియోగంలోకి తేవాలని కోరారు.సిపిఐ చేసిన ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన ఈ ప్రాంత ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్,జిల్లా నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్,మండల కార్యదర్శి జి వెంకన్న, మండల నాయకులు ఎం గిరి ప్రసాద్, బి హరి, ఆర్ రమేష్, ఎం లోకేష్, డి జనార్ధన్, బి వీరన్న, భీముడు, బీముడు, కార్యకర్తలు ఉన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System