తెలంగాణ జేఏసీ నూతన చైర్మన్ గుండా కరుణాకర్ రెడ్డి సన్మాన సభ కు భారీగా తరలిరావాలి:
ప్రజాసంఘాల జేఏసీ పాలేరు డివిజన్ కన్వీనర్ మందడి ఇజ్రాయిల్
తిరుమలాయపాలెం, జూలై 22 ( నమస్తే న్యూస్ )తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన తిరుమలాయపాలెం మండలానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది గుండా కరుణాకర్ రెడ్డి సన్మాన సభ ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు తిరుమలాయపాలెంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ పాలేరు నియోజకవర్గ కన్వీనర్ మందడి ఇజ్రాయిల్ తెలిపారు. మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. గుండా కరుణాకర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం తిరుమలాయపాలెం మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పున్నం రాజశేఖర్, మాజీ సర్పంచ్ గడ్డికొప్పుల రాజు, బొబ్బ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

