వివాదాస్పద భూమిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్.
ఎస్టీ ట్రైబల్ కమిషన్‌కు ఫిర్యాదు నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన.
నర్సింహులపేట, జూలై 25 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామ శివారులో ఉన్న వివాదాస్పద భూమిని జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. అనిల్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టేకుల యాదగిరి రెడ్డి, పూల్ సింగ్‌లకు సంబంధించిన భూములపై నెలకొన్న వివాదంపై ఎస్టీ ట్రైబల్ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో, ఆ మేరకు అధికారులు స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత భూముల సరిహద్దులు, రికార్డులు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను లోపు సేకరించి,నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఈ శ్రీనివాస్,తాసిల్దార్ రమేష్ బాబు, ఆర్ ఐ శ్రావణ్ కుమార్, సర్వేయర్ శ్రీ నిత్య,జిపిఓ రాధిక,మోహన్,రాంబాబు, భూమి యజమానులు తదితరులు పాల్గొన్నారు.

