Type Here to Get Search Results !

రైతు రుణాలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయాలి.

NAMASTHE NEWS 0

  • రైతు రుణాలపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయాలి. 
  • 2 లక్షల పైబడిన రుణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
  • వడ్డీల భారంతో అల్లాడుతున్న రైతులు.
  • రైతులకు ఉపశమనం కల్పించండి.
  • సిపిఐ జిల్లా సమితి సభ్యులు అబ్దుల్ రషీద్.


మరిపెడ(జులై 23)నమస్తే న్యూస్.

మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ..మండలంలోని రైతులు వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఓ టీ ఎస్ అమలు చేయాలి:ప్రభుత్వం 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన నేపథ్యంలో,2 లక్షలకు పైబడిన రుణాలు కూడా మాఫీ అవుతాయనే ఆశతో రైతులు సకాలంలో చెల్లించలేదని,ఈ విషయమై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని.రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో అసలుకు-భారీ వడ్డీలు చేరి ఆర్థిక భారం పెరిగిందన్నారు.కాబట్టి బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేసి వడ్డీల్లో రాయితీలు ఇవ్వాలని కోరారు.

ఖాతాలపై హోల్డ్‌లు ఎత్తివేయాలి:రుణ బకాయిల కారణంగా రైతుల ఖాతాలపై హోల్డ్‌లు విధించడంతో రైతుబంధు,ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంటి ప్రభుత్వ సాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షోభంలో రైతు: ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం,వర్షాభావం,పెరిగిన సాగు ఖర్చులు,తగ్గిన దిగుబడులతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని తెలిపారు.రైతులు ఒకేసారి మొత్తం బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేరని,బ్యాంకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం,బ్యాంకు యాజమాన్యాలు వెంటనే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో లక్ష్మణ్,వీరన్న,భగవత్,దీపక్,రాములు తదితర రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System