- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
- హౌసింగ్ డిఈ భూక్య రాజన్న హామీ.
- వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
మరిపెడ,జూలై 23(నమస్తే న్యూస్).
పేదల కొరకు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హౌసింగ్ విభాగం డిఈ భూక్య రాజన్న అన్నారు.గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్మించిన 26 మంది విలేకరుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను,హౌసింగ్ బోర్డు సమీపంలోని 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను డిఈ భూక్య రాజన్న,ఏఈ కాటికల గోపి కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ హౌసింగ్ పిడి పురుషోత్తం ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు.ఇళ్లలో విద్యుత్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ నుంచి డిమాండ్ నోటీసు అందిన వెంటనే హౌసింగ్ శాఖ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నందున లబ్ధిదారులు వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.

