Type Here to Get Search Results !

దోమల వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించండి:ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి గుగులోత్ రవి

NAMASTHE NEWS 0

  • ప్రజారోగ్య రక్షణే లక్ష్యం–వర్షాకాల వ్యాధులపై ప్రత్యేక దృష్టి.
  • డ్రై-డే,వైద్య శిబిరాల నిర్వహణకు ఆదేశం.
  • దోమల వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించండి.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి గుగులోత్ రవి.






డోర్నకల్/మరిపెడ(జులై 23)నమస్తే న్యూస్.

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గుగులోతు రవి ఆధ్వర్యంలో అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ,వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ముఖ్యంగా గ్రామాల్లో దోమల ద్వారా,కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.


సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:

- కాలానుగుణ వ్యాధులపై అవగాహన: మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,ఫైలేరియా,టైఫాయిడ్,వైరల్ జ్వరాలు రాకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

- వారానికి రెండు రోజులు పొడి రోజు: ప్రతి మంగళవారం,శుక్రవారం నాడు గ్రామస్థాయి అధికారులతో కలిసి ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా"పొడి రోజు"కార్యక్రమాలు చేపట్టాలి.

- వైద్య శిబిరాలు:ముందస్తు ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ రూపొందించి అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలి.

- గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకా: 14 నుండి 15 సంవత్సరాల వయసు గల బాలికలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.యుక్తవయసు బాలికల పరీక్షలు: గ్రామాల్లోని యుక్తవయసు బాలికలను గుర్తించి,వారికి అవసరమైన రక్త పరీక్షలు చేయాలి.కొత్త జంటల సంరక్షణ కొత్తగా వివాహమైన జంటలను గుర్తించి,వారిలో రక్తహీనత నివారణకు మరియు సురక్షిత గర్భధారణపై అవగాహన కల్పించాలి.

క్షయ మరియు దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు.క్షయ వ్యాధి నిర్ధారణ కొరకు కఫం నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపాలి.30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రక్తపోటు,మధుమేహ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలి.ఈ కార్యక్రమంలో పూజిత,స్వామి,కిరణ్,మంగమ్మ,ఆచార్యులు,మాధవి,అఖిల,ఝాన్సీ,అనిత,సౌజన్య,సతీష్,ఉపేంద్ర,సరిత మరియు ఆరోగ్య కార్యకర్తలు,ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System