Type Here to Get Search Results !

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

NAMASTHE NEWS 0

  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం
  • కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలి
  • పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించే నాయకుడు సర్వోత్తమరెడ్డి
  • మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి



రిపోర్టర్ దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 8 (నమస్తే న్యూస్)

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన రామిరెడ్డి సర్వోత్తమరెడ్డి విజయం ఖాయమని మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డి గెలుపు కోసం ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధతతో పాటు పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలతో సర్వోత్తమరెడ్డికి ఉన్న అనుబంధం ఎన్నికల్లో ఆయనకు కలిసొస్తుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఆశయాలను, సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు సర్వోత్తమరెడ్డికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు.ప్రస్తుతం ఏఐసీసీ, టీపీసీసీ సభ్యుడిగా  సర్వోత్తమరెడ్డి పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System